ENGLISH | TELUGU  
Home  » TV News

అభయ్ నవీన్.. బూతు పురాణం!

on Sep 20, 2024

 

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం మొదలైన అన్ని టాస్క్ లలో కంటే ప్రభావతి 2.0 టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. సోనియా, నిఖిల్, పృథ్వీ కలిసి ఆడే ఆటలో మిగిలిన వాళ్ళంతా మానసికంగా బాధపడుతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు అభయ్ నవీన్ చేరాడు. అసలేం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం.

నిన్న హౌస్ లో బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరిని సోఫాలో‌ కూర్చోబెట్టి.. బిగ్‌బాస్ ఇంటి కిచెన్‌లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్‌లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీమ్‌కి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి తీసుకుంటామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయాయి. ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టుక పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసినోళ్లు.. అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా ధమాక్ లేదు మీకు.. తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా.. నీయమ్మా సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్.. సైకోగాడు బిగ్‌బాస్ అంటూ రెచ్చిపోయాడు.

ఇక ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో  అభయ్ నవీన్ చేతులెత్తేశాడు. వాళ్ళ టీమ్ అంతా ఎగ్స్ కోసం కష్టపడుతుంటే ఏం పట్టనట్లు కూర్చున్నాడు. ఇది చూసి బిబి ఆడియన్స్ అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. ఈట్ ఫై స్టార్ డూ నథింగ్ అనే క్యాప్షన్ పెట్టి అభయ్ ఖాళీగా కూర్చొని ఉన్న ఫోటోని ఆడ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. బెలూన్స్ టాస్క్ లో నిఖిల్ కి ఫెయిర్ గా సోనియా రిజల్ట్స్ చెప్పడంతో అలిగిన అభయ్.‌. కోపంతో బిగ్ బాస్ పెట్టే ఏ టాస్క్ ఆడనని ఫుల్ ఫ్రస్టేషన్ తో చెప్పాడు. ఇక మరోవైపు వాళ్ళ టీమ్ లోని ఆదిత్య, ప్రేరణ, నబీల్, యష్మీ, మణికంఠ అంతా కలిసి ఛీఫ్ లేకుండా సరైన గేమ్ ని ఆడలేకపోతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ వారం అభయ్ కి ఓటింగ్ కూడా తక్కువే ఉండేలా ఉంది. మరి హౌస్ లో అభయ్ ఇలా ఉండటం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.